అపొస్తలుల బోధ
460 subscribers
433 photos
2 videos
187 links
📖 ఆత్మీయ సందేశాలు కొరకు - ( www.cockm.in )

👤 అడ్మిన్ చాట్ బాక్స్ - ( @cocAdminChatBox_bot )

🗣️ గ్రూప్ లింక్ - ( @ApostolicDoctrineRom1616 )
Download Telegram
❀ 𝐓𝐨𝐩𝐢𝐜 : *"ప్రేమ - అంటే నీ భావనేమోగానీ"? (LOVE)*
👇
❀ 𝐋𝐢𝐧𝐤 : [ https://www.cockm.in/2020/02/Love.html ]
యథార్థ వంతులైన ఆరాధికులంటే.?
🔥 *TOPIC:- "ఎఫెసీ. 5:19 మరియు కొలస్సీ. 3:16"*
👇🏿
[ www.cockm.in/2017/09/Eph-5-19-Col-3-16.html ]
👇
ఎఫెసి 5:19; కొలస్స. 3:16 ని పరిగణనలో తీసుకొని ఆరాధనలో వాయిద్యాలు ప్రవేశ పెట్టుకొనే వారు తెలుసుకోవలసిన సత్యం👆
Happy Resurrection/Lord's Day
Happy Resurrection/Lord's Day
➡️ Topic : *దేవుని క్రమములో "స్త్రీ" పాత్ర*

➡️ Link : www.cockm.in/2017/04/roleofwomen.html
అపొస్తలుల బోధ 【 www.cockm.in
క్రీస్తు తనను సేవించామనే కోరారు, ఆరాధించామని కాదు.
🧎🏿‍♂️ *TOPIC : పలురకాల ఆరాధన*
                  👇🏿
[ https://www.cockm.in/2021/09/types-of-worship.html ]
                   👆
● పైన అంశమును పూర్తిగా చదివాక "మీరు" ఏ ఆరాధన  క్రింద ఉన్నారో మరియు ఏ ఆరాధన క్రింద ఉండాలనేది సమయం ఉండగానే ఆలోచించుకొనగలరు, సరిచేసుకొనగలరని మనవి.🙏
Happy Resurrection/Lord's Day
_*క్రైస్తవులపై దాడులు జరిగినప్పుడు తిరిగి క్రైస్తవులుగా మనం ఏం చేస్తే బాగుంటుంది.🤔🤔🤔*_
📖📖📖📖📖📖📖📖📖📖📖

మన ముందు ఉండే ఆప్షన్స్

(1) తిరిగి మనం కూడా దాడులు చేయడం.
(2) వారిని శిక్షించాలని అధికారులను కోరడం.
(3) ర్యాలీలు ధర్నాలు నిర్వహించడం.
(4) మనకెందుకు అనుకొని మౌనంగా ఉండటం.

పైన పేర్కొన్న విధంగా చేయడానికి గ్రంథంలో ఎలాంటి ఆధారాలు లేవు.

📖 గ్రంథం యొక్క సమాధానం...

*కష్టాలలో ఇబ్బందులలో ఉన్న వారి కోసం ప్రార్థించి మనవంతు సహాయం చేయడం.*
దీనికి గ్రంథం సపోర్ట్ చేస్తుంది.
గ్రంథంలో మనం చూస్తే యెరూషలేము సంఘం కరువులో హింసలలో ఉన్నప్పుడు మాసిదోనియా సంఘం వారు, అలాగే మాసిదోనియా సంఘం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు యెరూషలేము సంఘం వారు సహాయం చేసినట్లు చూడగలము.
(అపో 11:27-30 & రోమా 15:25-27 & 1కొరంథీ 16:1-5 & 2కొరంథీ 8:1-24 & 9:1-15 యాకోబు 2:14-18 & 1 యోహాను 3:17)

*ప్రభువు చెప్పిన కొన్ని మాటలు*
👇👇👇👇👇👇👇👇👇

మత్తయి 5:10-12,39,44

-> నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

-> నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.

-> సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

-> నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము.

-> నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

-> ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు (క్రీస్తు)మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.(కొలస్సీయులకు 3:13)

-> క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు. (2తిమోతికి 3:12)

-> ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. (1పేతురు 4:16)

-> నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను. (యోహాను 16:33)

-> సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. (1యోహాను 3:13)

-> నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటి వనియు,నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. (ప్రకటన గ్రంథం 2:2,3)

*🎯 దేవుని సేవలో పౌలు గారి శ్రమలు:-*
(2కోరింథీ 11:23-27)

-> అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని;
-> అపరిమితముగా దెబ్బలు తింటిని,
-> అనేకమారులు ప్రాణాపాయములలో ఉంటిని.
-> యూదుల చేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;
-> ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని;
-> ఒకసారి రాళ్లతో కొట్టబడితిని;
-> ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని;
-> ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని.
-> అనేక పర్యాయములు ప్రయాణములలోను,
-> నదులవలననైన ఆపదలలోను,
-> దొంగలవలననైన ఆపదలలోను,
-> నా స్వజనులవలననైన ఆపదలలోను,
-> అన్యజనులవలననైన ఆపదలలోను,
-> పట్టణములో ఆపదలోను,
-> అరణ్యములో ఆపదలోను,
-> సముద్రములో ఆపదలోను,
-> కపట సహోదరులవలని ఆపదలలో ఉంటిని.
-> ప్రయాసతోను,
-> కష్టములతోను,
-> తరచుగా జాగరణములతోను,
-> ఆకలిదప్పులతోను,
-> తరచుగా ఉపవాసములతోను,
-> చలితోను,
-> దిగంబరత్వముతోను ఉంటిని,
-> ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి.

*🎯 ఇన్ని శ్రమలు అనుభవించిన భక్తులు చెప్పిన మాటలు:-*

అపో.కార్యములు 14:22
శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.

ఫిలిప్పీయులకు 1:12-14
సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికిని తక్కినవారికందరికిని స్పష్ట మాయెను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి.

2కోరింథీయులకు 4:16,17
కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.
హెబ్రీయులకు 13:3
మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.

1పేతురు 3:9
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

1పేతురు 3:14
మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;

1పేతురు 2:19-21
ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును; *ఇందుకు మీరు పిలువబడితిరి*.క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

1పేతురు 4:12-14
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.

ప్రకటన గ్రంథం 1:9
మీ సహోదరుడను, *యేసునుబట్టి కలుగు శ్రమలోను* రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను *దేవుని వాక్యము నిమిత్తమును* *యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును* పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

ప్రకటన గ్రంథం 7:13,14
పెద్దలలో ఒకడుతెల్లని వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు? ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెనువీరు *మహాశ్రమలనుండి* వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.
===============================

*👉 ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు / నిర్వహించాలని చెబుతున్నారు.. సరే మీ అందరికీ సూటిగా కొన్ని ప్రశ్నలు ప్రశ్నిస్తున్నాను (సంధిస్తున్నాను).*
👇👇👇👇👇👇👇

(1) మీలో ఎంతమంది ప్రభువులోనికి (సంఘములోనికి) బాపిస్త్మము తీసుకున్నారు ?

(2) ఎంతమంది బాప్తీస్మం తీసుకున్న రోజు నుంచి నమ్మకంగా ఉన్నారు ?

(3) ఎంతమంది సంఘంలో ఉన్న అందరితో సమాధానం కలిగి ఉన్నారు ?

(4) ఎంతమంది అన్యుల మధ్య దేవుని నామానికి అవమానం కలిగించలేదు ?

(5) ఎంతమంది కుటుంబ సభ్యులను దేవునిలోనికి నమ్మకంగా నడిపించుకుంటున్నారు ?

(6) ఎంతమందికి వాక్యం పట్ల ఏకత్వము, ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఉన్నారు ?

(7) ఎంతమంది ఇలా ధర్నా చేయడానికి వెళ్లినట్లు సువార్త చేయడానికి వెళ్ళారు ?

(8) ఎంతమంది బాప్తీస్మం తీసుకున్న రోజు నుంచి ఆరాధన మానుకోలేదు ?

(9) ఎంతమంది దేవుని కొరకు ఇప్పటివరకు ఎన్ని ఆత్మలు రక్షించారు ?

(10) ఎంతమంది రక్షించిన ఆత్మలను వాక్యంలో సరిగా పెంచుతున్నారు ?

ఇలా చెప్పుకుంటూ పోతే మనలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి అని చెప్పక తప్పదు.
===============================

ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే ఎక్కడ ఏమి జరిగినా కూడా దేవుని సెలవు (అనుమతి) లేకుండా జరగదు. ఎవరిని ఎప్పుడు పిలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసు.

-> ముందు నువ్వు మారు,
-> నీ కుటుంబం మార్చుకో,
-> నీ పొరుగువారిని మార్చు,
-> నీ సాక్ష్యాన్ని కాపాడుకో,
-> మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మాదిరిగా ఉండు...
-> దేవుని కోసం నిన్ను నీవు సమర్పించుకో...
-> కష్టాలలో ఇబ్బందులలో ఉన్నవారు కనిపిస్తే నీ కష్టార్జితం ఖర్చు పెట్టు...
-> సువార్త వ్యాప్తి కోసం నీ శరీరాన్ని , నీ బలాన్ని, నీ ధనాన్ని వినియోగించు...

అన్నిటికీ దేవుడు ఉన్నాడని నమ్మి ముందుకు కొనసాగిపో...

ప్రకటన గ్రంథం 22:10-12
కాలము సమీపమైయున్నది;
అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము,(లేక, చేయును) అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము,(లేక, యుండును) నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును) పరిశుద్ధుడు ఇంకను పరిశుద్దుడుగానే యుండనిమ్ము.(లేక, యుండును) ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.
*యేసు క్రీస్తు ప్రభువు మరియు అతని శిష్యులు (అపొస్తలులు) మరియు ఆదిమ సంఘము మనందరికంటే ఎన్నో ఘోరమైన నిందలు, హింసలు, శిక్షలు ఆనందంగా అనుభవించారు. వారు ఎవరూ కూడా మనకు లాగా రోడ్ల మీదకు వెళ్ళి ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించలేదు.*

*430 సంవత్సరాల  ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించాడు.*

*70 సంవత్సరాల బబులోను చెర నుంచి విడిపించాడు.*

*అగ్ని గంధకాల నుంచి సింహాల బోనులో నుంచి కాపాడాడు. వారిని కాపాడిన దేవుడు మనలను కాపాడలేడా ? లేదంటే వారికున్న విశ్వాసం మనకు లేదా ?*


*ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.* (అపో.కా 5:41)

*కొందరైతే యాతనపెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొఱ్ఱెచర్మములను మేకచర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండలమీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. (హెబ్రీ 11:35-38)*

రోమీయులకు 8:35-39
*క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.*

ఎఫెసీయులకు 6:10-18
*తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులైయుండుడి. మీరు అపవాది(అనగా సాతాను) తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో (మూలభాషలో - రక్తమాంసములతో) కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడుతొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.*